రాంచరణ్ తండ్రి కాబోతున్నాడు : చిరంజీవి

రాంచరణ్ తండ్రి కాబోతున్నాడు : చిరంజీవి

మెగా అభిమానులకు చిరంజీవి గుడ్ న్యూస్ చెప్పారు.  తన తనయుడు, మెగా పవర్  స్టార్ రామ్ చరణ్ తేజ్, ఉపాసన తల్లిదండ్రులు కాబోతున్నట్లుగా ట్విట్టర్ ద్వారా  వెల్లడించాడు. 2012లో రామ్ చరణ్ తేజ్, ఉపాసన  పెళ్లి కాగా పదేళ్ల తరువాత ఈ జంట త్వరలో ఓ బిడ్డకు జన్మినివ్వబోతుంది.  దీంతో సినీ సెలబ్రిటీలతో పాటుగా అభిమానులు చరణ్, ఉపాసనలకు అభినందనలు తెలుపుతున్నారు. 

RRR మూవీతో ప్రేక్షకులను ఆలరించిన రామ్ చరణ్... ప్రస్తుతం శంకర్ డైరక్షన్ లో ఓ మూవీని చేస్తున్నాడు. ఇందులో చరణ్ కు జోడీగా కియరా హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ మూవీ తరువాత ఉప్పెన డైరక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమాకు చరణ్ కమిట్ అయ్యాడు