Upasana Baby Bump: సరోగసి వార్తలకు చెక్.. బేబీ బంప్‌తో ఉపాసన ఫోటోలు వైరల్!

Upasana Baby Bump: సరోగసి వార్తలకు చెక్.. బేబీ బంప్‌తో ఉపాసన ఫోటోలు వైరల్!

మెగా దంపతులు రామ్ చరణ్-ఉపాసన ఇటీవలే గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. తమ రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు 2025 అక్టోబర్ 23న వీడియో రిలీజ్ చేసి ఉపాసన అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ ఘనంగా ఉపాసనకు సీమంతం వేడుక కూడా నిర్వహించింది. ఈ వేడుకలో వెంకటేష్ దంపతులు, నయనతార దంపతులు, వరుణ్ తేజ్ జంట పాల్గొని సందడి చేశారు. అయితే సీమంతం అనంతరం, ఉపాసన బయట ఎక్కడా పెద్దగా కనిపించకపోవడంతో, సినీ వర్గాల్లో కొత్త టాక్ మొదలైంది.

ఈసారి ఉపాసన కవల పిల్లలకు జన్మనివ్వబోతుందన్న వార్త బలంగా వినిపించింది. కొందరు అయితే మరింత ముందుకెళ్లి, సరోగసి ద్వారా ట్విన్స్ అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వైరల్ చేశారు. ఈ వార్తలు మెగా అభిమానులను ఆశ్చర్యపరిచింది. కానీ, ఈ విషయాలపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం కూడా రియాక్ట్ అవ్వలేదు. దీంతో రూమర్స్ మరింత బలంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఉపాసన బేబీ బంప్‌తో దర్శనమిచ్చి అందరి నోర్లు మూయించింది. వివరాల్లోకి వెళితే..

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రముఖ జపనీస్ చెఫ్ అసవా తకమాసా ప్రత్యేకంగా వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తన చేతులతో స్పెషల్ బిర్యానీ వండి మెగా ఫ్యామిలీకి రుచి చూపించారు. ఈ విందులో రామ్ చరణ్, అమ్మ సురేఖ, ఉపాసనతో పాటు ఇతర కుటుంబ సభ్యులు పాల్గొని ఆస్వాదించారు. ముఖ్యంగా చరణ్ బిర్యానీ స్పెషాలిటీని వివరిస్తూ మాట్లాడిన వీడియో ఆకట్టుకుంది.

ఇప్పుడు ఈ విందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలలో ఉపాసన స్పష్టమైన బేబీ బంప్తో కనిపించింది. చరణ్ మాట్లాడేటపుడు వీడియో చేస్తూ ఆకట్టుకుంది. ఇదే విషయమై నెటిజన్లు ఓ క్లారిటీకి వచ్చారు. ఈ క్రమంలో ఉపాసన సరోగసి ద్వారా కవల పిల్లలకు జన్మనిస్తుందనే రూమర్స్‌కు పూర్తిగా ఎండ్ కార్డు పడింది. మరికొన్ని నెలల్లో ఉపాసన కవలలకు జన్మనిస్తుండటంతో, అడ్వాన్స్ విషెష్ చెబుతూ మెగా ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు.