
మెగా కుటుంబంలో పండగ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సంక్రాంతి సంబరాల కోసం మెగా అండ్ అల్లు ఫ్యామిలీ ఇప్పటికే బెంగళూరు ఫామ్‌హౌస్‌కు చేరుకున్నాయి. పండుగ సంబురాల్లో భాగంగా ఇంటి డెకరేషన్, పిండి వంటలు, విందు భోజనం, మెహందీ, యోగా టైమ్ కు సంబందించిన వీడియోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు మెగా కోడలు ఉపాసన.
ఇందులో భాగంగా తమ కుటుంబంలోకి ఇటీవల కోడలిగా అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠిని ప్రస్తావిస్తూ.. ‘కొత్త కోడలు ఇంటిల్లిపాదికి సున్నుండలు చేస్తోంది. ఆమె చాలా స్వీట్.. అంటూ ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోపై కొత్త కోడలు లావణ్య స్పందిస్తూ.. థ్యాంక్యూ.. సూపర్ స్వీట్ పెద్ద కోడలు.. అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.