క్రిస్మస్ స్పెషల్.. క్యూట్ డాటర్స్తో..బ్యూటిఫుల్ కపుల్స్

క్రిస్మస్ స్పెషల్.. క్యూట్ డాటర్స్తో..బ్యూటిఫుల్ కపుల్స్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram charan) ఉపాసన కొణిదెల (Upasana Konidela) దంపతులు తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. వీరిద్దరూ జూన్ 20న ఆడబిడ్డకు జన్మనివ్వగా మెగా కుటుంబంతో పాటు ఫ్యాన్స్ కూడా సంబరాలు చేసుకున్నారు. కాగా ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్  క్లిన్ కారా(Klin Kaara) కు సంబంధించిన ఒక్క ఫొటో కూడా బయటకు రాకుండా ఉపాసన, చరణ్ ఎంతో జాగ్రత్త పడుతూ వస్తున్నారు.

అలాగే మరో స్టార్ సెలబ్రెటీ పేరెంట్స్ అయిన బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor), అలియా భట్(Aliaabhatt) ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇక తమ ప్రిన్సెస్ రాహ (Raha)ను కూడా..చాలా కాలం నుంచి సోషల్ మీడియాకు..ఫోటో చిక్కకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నారు. 

ఇదిలా ఉంచితే..లేటెస్ట్గా క్రిస్మస్ స్పెషల్గా..తమ క్యూట్ డాటర్స్తో ఉన్న ఫొటోస్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఫొటోస్ నెటిజన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో రణబీర్ అలియా తమ కూతురు రాహా ఫోటో పంచుకోగా..ఉపాసన చరణ్ మాత్రం క్లిన్ కారా ఫోటో రివీల్ చేయలేదు.

అయితే రణబీర్ అలియా మాత్రం తమ కూతురు రాహాను మొదటిసారి..ఈ ప్రపంచానికి పరిచయం చేయడంతో..ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. క్యూట్ డాటర్స్తో..బ్యూటిఫుల్ కపుల్స్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

రీసెంట్గా టితో క్లిన్ కారా పుట్టి ఆరు నెలలు పూర్తి అయిన సందర్భంగా..ఈ మెగా దంపతులు ముంబైలోని మహాలక్ష్మి టెంపుల్కి వెళ్లారు. అక్కడ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదాలు తీసుకున్న విషయం తెలిసిందే.