పాప పుట్టాక ఉపాసన మొదటి పోస్ట్.. మీ ప్రేమకు కృతజ్ఞతలు

పాప పుట్టాక ఉపాసన మొదటి పోస్ట్.. మీ ప్రేమకు కృతజ్ఞతలు

మెగా ప్రిన్సెస్(Mega Princes) రాకతో మెగా కుటంబంలో ఆనందం నెలకొంది. పాప రాక తమకెంతో సంతోషాన్నిచ్చిందని మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక డెవిలివరీ అయ్యాక మూడు రోజుల తరువాత హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు ఉపాసన. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి. మెగా అభిమానులు మెగా ప్రిన్సెస్ కు గ్రాండ్ లెవల్లో వెల్కమ్ చెప్పారు. ఈ సందర్బంగా రామ్ చరణ్(Ram Charan) మీడియాతో మాట్లాడారు. పాప పుట్టడంతో తాను చాలా ఆనందంగా ఉన్నానని, ఈ సంతోష సమయంలో మాటలు కూడా రావడంలేదని, మాకు, మా పాపకు ఇంత ప్రేమ చూపించిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అంటూ చెప్పుకొచ్చారు రామ్ చరణ్. 

ఇక తాజాగా కూతురు పుట్టడంపై మొదటిసారి స్పందించారు ఉపాసన కొణిదెల(Upasana Konidela). "తమ పాపకు ఎంతో ప్రేమతో వెల్‌కమ్ చెప్పిన వారందరికీ థ్యాంక్యూ అంటూ.. పాప రామ్ చరణ్ తో ఇంటివద్ద దిగిన ఫొటోను షెర్ చేశారు ఉపాసన. ఆమె చేసిన పోస్టుకు హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్(Rakul preeth singh), ప్రియాంక చోప్రా(Priyanka chopra) స్పందించారు. రామ్ చరణ్, ఉపాసన జంటకు శుభాకాంక్షలు తెలిపారు.