చిరంజీవితో డైరెక్టర్ మారుతి సినిమా.. ఎప్పుడంటే?

చిరంజీవితో డైరెక్టర్ మారుతి సినిమా.. ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), క్రేజీ డైరెక్టర్ మారుతి(Maruti) కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను మారుతి ఎంతో ప్రస్టేజియస్గా  తీసుకుని..కూల్గా తెరకెక్కిస్తున్నాడు. ఇక లేటెస్ట్ గా మారుతి మెగా ఫోన్ పట్టుకోనున్నాడని సమాచారం.

మారుతి తన తదుపరి చిత్రాన్ని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తో చేయబోతున్నట్లు ఫిలిం సర్కిల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ న్యూస్ కొత్తదేమీ కాకపోయినప్పటికీ.. ప్రస్తుతం మెగాస్టార్ సెలెక్ట్ చేసే ప్రాజెక్ట్స్ అన్ని..కొత్త డైరెక్టర్స్ తో చేయడమే..ఈ వార్తకు గట్టి బలాన్ని ఇస్తుంది.

రీసెంట్గా చిరంజీవికి సరిగ్గా సెట్‌ అయ్యే ఒక మంచి కమర్షియల్‌ స్టోరీని మారుతి రెడీ చేశాడని, చిరంజీవి కూడా స్టోరీ లైన్ పై చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఆ మధ్య చిరు ఒక వేదికపై కూడా చెప్పుకొచ్చాడు.

అలాగే ప్రస్తుతం ప్రభాస్ తో చేసే సినిమాతో.. మారుతి బడా డైరెక్టర్ గా నిలవడం ఖాయంగానే కనిపిస్తోంది. తనదైన హ్యూమర్ టచ్ తో సినిమాలు చేసే మారుతికి..డార్లింగ్ ప్రభాస్ కూల్ యాక్టింగ్కి సరైన కథ పడితే..మారుతీ వెనక్కి చూసుకోవాల్సిన పరిస్థితి అస్సలు ఉండదు. ఈ ఒక్క హిట్తో మెగాస్టార్ తో సినిమా చేయడం కూడా చాలా సులభం అవుతుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. త్వరలో ఈ కాంబో నుంచి అప్డేట్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం చిరు..యంగ్ డైరెక్టర్ వశిష్ఠ, బాబీ, కళ్యాణ్ కృష్ణ తో మూవీస్ చేయబోతున్నాడు. 

మారుతి..ప్రభాస్..సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాకు రెండు టైటిల్స్ ను పరిశీలిస్తన్నారట మేకర్స్. అందులో ఒకటి రాయల్ కాగా, మరొకటి అంబాసిడర్. ఈ రెండు టైటిల్స్ లో ఒకటి ఈ సినిమాకు ఫిక్స్ చేయనున్నారని సమాచారం. 

హారర్ అండ్ కామెడీ జానర్ లో వస్తున్న ఈ సినిమాలో రీద్దీ కుమార్ (Riddi kumar), మాళవిక మోహన్ (Malavika Mohan), నిధి అగర్వాల్(Nidhi Agarwal) హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ (Sanjay Datt) మరో కీ రోల్లో కనిపించనున్నారు. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.