కన్నడ సినీ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ చీఫ్ ఉపేంద్ర, తన పార్టీ నుంచి లోక్ సభకు పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించారు. కర్ణాటక లోని 28 లోక్ సభ స్థానాల్లో తన పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. ముందుగా.. తొలి విడుత నామినేషన్ వేసిన 14 మంది అభ్యర్థులను మీడియాకు పరిచయం చేశారు ఉపేంద్ర. ఆయన పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు తప్పక కాకీ షర్ట్ ధరించి ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు. తమ గుర్తు ఆటో అని.. అందుకే తమ అభ్యర్థులు కాకీ షర్ట్ వేసుకుని ప్రజలకు దగ్గర అవుతారని చెప్పారు. కర్ణాటక ప్రజలు ఉత్తమ ప్రజాకీయ పార్టీని ఆశీర్వదిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచార ఖర్చు అభ్యర్తులే పెట్టుకుంటారని.. కర పత్రాలను మాత్రమే పార్టీ భరిస్తుందని తెలిపారు.
తొలి విడుత నామినేషన్ వేసిన 14 మంది అభ్యర్థులు:
ఉడిపి -చిక్కమగళూరు – సురేశ్ కుందర్, కోలారు – రామాంజినప్ప, చామరాజనగర్ – నాగరాజ్.ఎం, బెంగళూరు ఉత్తర – సంతోష్.ఎం,బెంగళూరు దక్షిణ – అహోరాత్రా, మండ్య – దివాకర్ సి.పి.గౌడ, చిత్రదుర్గ – దేవేంద్రప్ప,బెంగళూరు సెంట్రల్ – శ్రీదేవి మల్లేగట్టి, దక్షిణకన్నడ – విజయ్ శ్రీనివాస్, హాసన్ – చంద్రేగౌడ హెచ్.ఎం, తుమకూరు – ఛాయా రాజశంకర్, మైసూరు – ఆశారాణి, బెంగళూరు గ్రామీణ – మంజునాథ్.ఎం., చిక్కబళ్ళాపుర – మునిరాజు,
