ఆగస్టులో 2000 కోట్ల యూపీఐ లావాదేవీలు

ఆగస్టులో  2000 కోట్ల యూపీఐ లావాదేవీలు

న్యూఢిల్లీ: యూపీఐ లావాదేవీల సంఖ్య గతనెల 2000 కోట్ల మార్కును దాటిందని నేషనల్​ పేమెంట్స్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎన్​పీసీఐ) తెలిపింది. ఈ లావాదేవీల విలువ రూ. 24.85 లక్షల కోట్లుగా ఉంది. ఇది జులైలో నమోదైన రూ. 25.08 లక్షల కోట్ల కంటే తక్కువ. ఇప్పటి వరకు అత్యధికంగా మే నెలలో రూ. 25.14 లక్షల కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి. 

యూపీఐ లావాదేవీల మొత్తం విలువ ఏడాది ప్రాతిపదికన 21 శాతం పెరిగి రూ. 24.85 లక్షల కోట్లుగా నమోదైంది. గత ఏడాది ఇదే నెలలో ఇది రూ. 20.60 లక్షల కోట్లుగా ఉంది.  లావాదేవీల సంఖ్య ఏడాది ప్రాతిపదికన 34 శాతం పెరిగి 20.01 బిలియన్లకు చేరుకుంది.