UPI Rules: యూపీఐ యూజర్లకు శుభవార్త.. ఇవాళ్టి నుంచే కొత్త యూపీఐ రూల్స్..

UPI Rules: యూపీఐ యూజర్లకు శుభవార్త.. ఇవాళ్టి నుంచే కొత్త యూపీఐ రూల్స్..

UPI Limit UP: సెప్టెంబర్ 15 నుంచి కొత్త యూపీఐ రూల్స్ అమలులోకి వచ్చాయి. వ్యక్తుల నుంచి వ్యాపారులకు చేసే పేమెంట్స్ విషయంలో పరిమితులను పెంచుతున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సేవలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది.

యూపీఐ చెల్లింపుల్లో వచ్చిన మార్పులను పరిశీలిస్తే.. ఇకపై యూపీఐ యూజర్లు 24 గంటల కాలంలో రూ.10 లక్షలు విలువైన పేమెంట్స్ చేసేందుకు ఇవ్వబడింది. దీంతో వ్యక్తులు వ్యాపారులతో చేసే చెల్లింపుల పరిమితి రోజుకు రూ.10 లక్షలకు అప్ గ్రేడ్ చేయబడింది. ఇదే సమయంలో వ్యక్తి నుంచి వ్యక్తి మధ్య చేసే చెల్లింపులకు పరిమితి రోజుకు రూ.లక్షగా ఫిక్స్ చేయబడింది.

ముఖ్యంగా పెట్టుబడులు, ఇన్సూరెన్స్ చెల్లింపులకు ఒక్కో ట్రాన్సాక్షన్ లిమిట్ గతంలో ఉన్న రూ.2 లక్షలను ప్రస్తుతం రూ.5 లక్షలకు పెంచబడింది. అలాగే ఈ చెల్లింపులకు రోజువారా లిమిటి రూ.10 లక్షలు చేయబడింది. అలాగే పన్ను చెల్లింపులు లాంటి ప్రభుత్వ పేమెంట్ల విషయంలో కూడా ఒకేసారి రూ.5 లక్షల వరకు యూపీఐ ద్వారా చెల్లింపులను అనుమతిస్తున్నట్లు వెల్లడైంది. గతంలో ఇది ఒక్క ట్రాన్సాక్షన్ కి రూ.లక్ష పరిమితి మాత్రమే ఉండేది. 

ఇక క్రెడిట్ కార్డ్ చెల్లింపులు ఒకేసారి రూ.5 లక్షల వరకు చేయెుచ్చని చెప్పగా.. రోజు మెుత్తంలో దీనికి రూ.6 లక్షలు గరిష్ఠ పరిమితి ఉంచబడింది. ఇక లోన్, ఈఎంఐ చెల్లింపులకు కూడా రోజువారీ పేమెంట్ లిమిట్ రూ.10 లక్షలకు పెంచబడింది. బంగారం కొనుగోళ్లకు షాపులో చెల్లింపుల పరిమితిని రోజుకు రూ.6లక్షలుగా ఉంచుతూ ఒక్కో ట్రాన్సాక్షన్ లిమిటి రూ.2 లక్షలకు అప్ గ్రేడ్ చేయబడింది.