ఇంటర్నెట్​ లేకుండానే ఫీచర్ ఫోన్లలో యూపీఐ ట్రాన్సాక్షన్లు

ఇంటర్నెట్​ లేకుండానే ఫీచర్ ఫోన్లలో యూపీఐ ట్రాన్సాక్షన్లు
  • ఫీచర్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చిన భీమ్​ యూపీఐ సర్వీసులు

ముంబై: క్యాష్​లెస్​ పేమెంట్ల కోసం వాడే భీమ్​ యూనిఫైడ్​పేమెంట్స్​ ఇంటర్​ఫేస్​ ( యూపీఐ)   సిస్టమ్​ స్మార్ట్​ఫోన్లతోపాటు ఫీచర్​ ఫోన్లకూ అందుబాటులోకి వచ్చింది. మనదేశంలో దాదాపు 40 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు ఈ ప్లాట్‌‌ఫామ్‌‌ను ఉపయోగించుకునేలా ఆర్‌‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం ‘123 పే’ సర్వీసును ప్రారంభించారు. 2016లో స్మార్ట్‌‌ఫోన్ల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్​సీపీఐ) యూపీఐని మొదలుపెట్టింది. ఫీచర్ ఫోన్ యూజర్ల కోసం యూపీఐ యాక్సెస్‌‌ను ప్రారంభించడానికి యూఎస్​ఎస్​డీ కోడ్​ను (*99#) ఉపయోగించాలి.

ఈ సర్వీస్  ఉచితం కాదని, అన్ని టెల్కోలలో పనిచేయకపోవచ్చని డిప్యూటీ గవర్నర్ టి. రవిశంకర్ తెలిపారు. వాడకం కూడా అంత ఈజీగా ఉండదని వివరించారు. ప్రస్తుతం యూపీఐలోని అన్ని ఫీచర్లు స్మార్ట్‌‌ఫోన్‌‌లలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ‘‘ పేదలు, గ్రామీణులు స్మార్ట్​ఫోన్లను వాడలేకపోతున్నారు. అందుకే ఫీచర్​ఫోన్ల కోసం యూపీఐ 123 పేను మొదలుపెట్టాం. దీనివల్ల ఆన్​లైన్​ పేమెంట్లు మరింత పెరుగుతాయి. మరింత మందికి ఫైనాన్షియల్​ సేవలు అందుబాటులోకి వస్తాయి’’ అని దాస్ తెలిపారు.  
నాలుగు రకాలుగా యూపీఐని వాడొచ్చు
ఫీచర్ ఫోన్ యూజర్లు ఇప్పుడు నాలుగు రకాలుగా యూపీఐని ఉపయోగించుకోవచ్చు. ఐవీఆర్​ (ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నంబర్‌‌కు కాల్ చేసి యూపీఐ ట్రాన్సాక్షన్​ చేయవచ్చు. ఫీచర్ ఫోన్‌‌లలో యాప్​ను ఉపయోగించుకొని యూపీఐని వాడొచ్చు. మిస్డ్ కాల్ ఆధారిత విధానాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ప్రాక్సిమిటీ  సౌండ్ ఆధారిత చెల్లింపు విధానమూ ఉంటుంది. ఇందుకు ఇంటర్నెట్​ కనెక్షన్​ అవసరం లేదు.  ఈ నాలుగు పద్ధతుల ద్వారా ఫీచర్​ఫోన్​  యూజర్లు స్నేహితులకు, కుటుంబ సభ్యులకు డబ్బు చెల్లించవచ్చు. యుటిలిటీ బిల్లులు కట్టవవచ్చు. వెహికల్​ ఫాస్ట్ ట్యాగ్‌‌లను రీఛార్జ్ చేయవచ్చు. మొబైల్ బిల్లులను చెల్లించవచ్చు.  ఖాతా బ్యాలెన్స్‌‌లను చూసుకోవచ్చు.  బ్యాంక్ ఖాతాలను లింక్ చేయవచ్చు.

యూపీఐ పిన్‌‌లను మార్చవచ్చు. ప్రతి ఏటా యూపీఐ  వాడకం వేగంగా పెరుగుతోంది.2021  ఫైనాన్షియల్ ఇయర్​లో రూ.41 లక్షల కోట్ల విలువైన ట్రాన్సాక్షన్లు రికార్డు కాగా ఈ ఏడాది ఇప్పటివరకు వీటి విలువ రూ.76 లక్షల కోట్లకు చేరుకుందని దాస్ చెప్పారు. యూపీఐ ద్వారా త్వరలోనే రూ. 100 లక్షల కోట్ల లావాదేవీల రికార్డును చేయవచ్చని దాస్ చెప్పారు.  ఈ సందర్భంగా యూపీఐ యూజర్ల కోసం 24x7 హెల్ప్‌‌లైన్‌‌ను ప్రారంభించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌‌పిసిఐ) 'డిజిసాథి' పేరుతో దీనిని నిర్వహిస్తుంది.   డిజిటల్ చెల్లింపులకు సంబంధించి సాయం చేస్తుంది. యూజర్లు డిజిటల్ పేమెంట్స్​   ఫిర్యాదుల కోసం www.digisaathi.infoని చూడవచ్చు లేదా   ఫోన్ల నుండి 14431/  1800 891 3333 నంబర్లకు కాల్ చేయవచ్చు.

 

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్పై రష్యా యుద్ధం: లైవ్ అప్డేట్స్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లైవ్ అప్‎డేట్స్

వండర్స్‌‌ క్రియేట్‌‌ చేయాలంటే.. ఇలా కూడా చేయొచ్చు