యూపీఐ ట్రాన్సాక్షన్లు 936 కోట్లు

యూపీఐ ట్రాన్సాక్షన్లు 936 కోట్లు
  • ఈ ఏడాది జనవరి–మార్చిలో

న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరి– మార్చి క్వార్టర్‌‌‌‌లో దేశంలో ఏకంగా 936 కోట్ల ఆన్‌‌లైన్ పేమెంట్‌‌ ట్రాన్సాక్షన్లు యూపీఐ ద్వారా జరిగాయని పేమెంట్ సర్వీసెస్ కంపెనీ వరల్డ్‌‌లైన్‌‌ ఓ రిపోర్ట్‌‌లో పేర్కొంది. ఈ ట్రాన్సాక్షన్ల విలువ సుమారు రూ. 10.25 లక్షల కోట్లని వివరించింది. యూపీఐ ట్రాన్సాక్షన్లలో  యూపీఐ పీ2ఎం (పర్సన్‌‌ టూ మర్చంట్‌‌) ట్రాన్సాక్షన్ల వాటా  ఎక్కువగా ఉందని తెలిపింది. వరల్డ్‌‌లైన్ రిపోర్ట్ ప్రకారం, యూపీఐ పేమెంట్లలో యూపీఐ పీ2ఎం వాటా వాల్యూమ్ పరంగా 64 శాతంగా, వాల్యూ పరంగా 50 శాతంగా ఉంది.

కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి క్వార్టర్‌‌‌‌లో యూపీఐ ట్రాన్సాక్షన్లు డబుల్ అయ్యాయి. యూపీఐ పీ2ఎం ట్రాన్సాక్షన్లు ఎక్కువగా ఫోన్‌‌పే, గూగుల్ పే, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌‌, అమెజాన్ పే, యాక్సిస్ బ్యాంక్ యాప్‌‌ల ద్వారా జరిగాయి. యూపీఐ పీఎస్‌‌పీ (పీర్‌‌‌‌ టూ పీర్‌‌‌‌) ట్రాన్సాక్షన్లలో యెస్‌‌ బ్యాంక్‌‌, యాక్సిస్ బ్యాంక్‌‌, స్టేట్ బ్యాంక్‌‌, హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్‌‌, పేటీఎం పేమెంట్స్ బ్యాంకులు ముందున్నాయి.