
ఉప్పునుంతల, వెలుగు: ఉప్పునుంతల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి ఉత్తమ సొసైటీ నాబార్డ్ అవార్డును రెండో సారి లభించింది. మంగళవారం హైదరాబాద్ నాబార్డ్ రీజియన్ ఆఫీసులో 44వ నాబార్డ్ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్తమ సేవలు అందిస్తున్న సొసైటీలను గుర్తించి అవార్డులను ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సహకార వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, టిఎస్సీఏబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, సహకార కమిషనర్ సురేంద్ర మోహన్, ఎన్ఎపీసీఏబి చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, నాబార్డ్ సీజీఎం ఉదయ్ భాస్కర్ అవార్డును సంఘం అధ్యక్షుడు, మహబూబ్ నగర్ డీసీసీబీ డైరెక్టర్ సత్తు భూపాల్ రావు, సంఘ సీఈవో కొత్త రవీందర్‌రావు కు అందించారు.