పూజా ఖేడ్కర్కు షాక్.. సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ

పూజా ఖేడ్కర్కు షాక్.. సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసిన యూపీఎస్సీ

వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ కు యూపీఎస్సీ షాక్ ఇచ్చింది. పూజా ఖేడ్కర్ సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేసింది. ఆమె భవిష్యత్ లో పరీక్షలకు హాజరు కాకుండా నిషేధించింది. జూలై 19న ఖేద్కర్  ను సివిల్ సర్వీసెస్ పరీక్షలో అభ్యర్థిత్వాన్ని పొందేందుకు వైకల్యం , నాన్ క్రీమీలేయర్ కోటాలను దుర్విని యోగం చేసినందుకు ఆమెపై ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ కేసు నమోదు కూడా చేసింది. 

పుణె జిల్లా కలెక్టరేట్ లో ప్రొబేషనరీ అసిస్టెంట్ కలెక్టర్ గా ఉన్న 2023 బ్యాచ్ ఐఏఎస్  అధికారి పూజా ఖేడ్కర్.. ఐఏఎస్ లో సీటు సంపాదించేందుకు నకిలీ అంగ వైకల్యం సర్టిఫికెట్లు ప్రొడ్యూస్ చేశారనే ఆరోపణలతో పుణె నుంచి వాషిమ్ కు బదిలీ అయ్యారు. పూజా ఖేడ్కర్ పుణెలో ఉన్న సమయంలో తన పోస్టుకు లేనటువంటి సౌకర్యాలను డిమాండ్ చేయడం ద్వారా అధికారాలను దుర్వినియోగం చేసింది. యూపీఎస్సీలో ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్ కోటను పొందినట్లు కూడా ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. 

పూజా ఖేడ్కర్ పై వచ్చిన ఆరోపణలతో ఆమె ప్రొబేషనరీ పీరియడ్ ను రద్దు చేసింది యూపీఎస్సీ. ఉత్తరాఖండ్ లోని ముస్సోరీలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కు ఆమెను రీకాల్ చేశారు.