అప్లికేషన్ ఫీజు కేవలం రూ.25లే.. 44 వేల జీతం వచ్చే 2253 ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు కేవలం రూ.25లే.. 44 వేల జీతం వచ్చే 2253 ఉద్యోగాలు

దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ESIC) కేంద్రాల్లో పని చేసేందుకు నర్సింగ్ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా మొత్తం 1930 నర్సింగ్ ఆఫీసర్, 323 పర్సనల్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. బీఎస్సీ నర్సింగ్ లేదా పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్, డిప్లొమా ఇన్ నర్సింగ్ చదివినవారు నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఒక సంవత్సరం నర్స్ గా పనిచేసిన అనుభవం కూడా ఉండాలి.  ఏదైనా డిగ్రీ చదివిన వారు పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ మార్చి 7న ప్రారంభంకాగా..  మార్చి 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 

మార్చి 27, 2024 నాటికి 18- నుంచి30 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. ఓబీసీలకు 33, ఎస్సీ, ఎస్టీలకు 35, దివ్యాంగులకు 40 ఏళ్లు రిజర్వేషన్ ను బట్టి వయోపరిమితి కలదు. అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి కేవలం రూ.25లే ఫీజు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు అసలు ఫీజే లేదు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆఫ్ లైన్ లో ఆబ్జెటీవ్ టైప్ లో ఎగ్జామ్ ఉంటుంది. రాత పరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేస్తారు. 2024 జూలై 7న పరీక్ష నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో  హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురం ఎగ్జామ్ సెంటర్లు ఉన్నాయి.