ITI, డిప్లొమా, బీటెక్ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్.. !

ITI, డిప్లొమా, బీటెక్ చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. పరీక్ష లేకుండానే జాబ్.. !

యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యూసీఐఎల్) అప్రెంటీస్​ పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ ఫిబ్రవరి 28.

ఖాళీలు: 364.

విభాగాల వారీగా ఖాళీలు
ఎక్స్–ఐటీఐ 269: ఫిట్టర్ 78, ఎలక్ట్రీషియన్ 78, వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) 35, టర్నర్/ మెషినిస్ట్ 09, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్ 04, మెకానికల్ డిజిల్/ మెకానికల్ మోటర్ వెహికల్ 07, కార్పెంటర్ 04, ప్లంబర్ 04, మేట్ (మైన్స్) 50. 

టెక్నీషియన్ అప్రెంటీస్ 60: మైనింగ్ 25, సివిల్ 15, మెకానికల్ 10, ఎలక్ట్రికల్ 10.

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ 35: మైనింగ్ 05, సివిల్ 05, మెకానికల్ 05, ఎలక్ట్రికల్ 05, అడ్మినిస్ట్రేషన్, పర్చేజ్ 10, ఫైనాన్స్ 05. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీఏ/ పీజీడీఎం, బీఏ, బీబీఏ, బి.కాం., బి.టెక్./ బీఈ, సంబంధిత విభాగంలో డిప్లొమా, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఫిబ్రవరి 01

లాస్ట్ డేట్: ఫిబ్రవరి 28.

సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక మెరిట్ ఆధారంగా ఉంటుంది. అంటే సంబంధిత రంగాల్లో పొందిన మార్కుల శాతం ఆధారంగా ఉంటుంది.

పూర్తి వివరాలకు www.ucil.gov.in వెబ్​సైట్​ను సందర్శించండి. 

 

►ALSO READ | ICMR ఉద్యోగ నోటిఫికేషన్ : అర్హతలివే.. ఫిబ్రవరి 10న వాక్-ఇన్ ఇంటర్వ్యూ!