మాస్ బాలయ్యతో ఊర్వశి..పల్స్రేట్ పడిపోవటమో..పెరగటమో!

మాస్ బాలయ్యతో ఊర్వశి..పల్స్రేట్ పడిపోవటమో..పెరగటమో!

బాలీవుడ్, టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ ఐటెం క్వీన్ గా తన సత్తా చాటుతోంది ఊర్వశీ రౌతేలా(Urvashi Rautela). అందంతో, తన డ్యాన్స్తో కుర్రకారును ఊపేస్తున్న ఈ భామ ప్రస్తుతం వరుస ఐటెమ్ సాంగ్స్తో క్రేజీ సంపాదించుకొంది.వరుసగా టాలీవుడ్ లో నాలుగు ఐటెం సాంగ్స్లో యాక్ట్ చేసి..కుర్రాళ్లకు హీటెక్కించేస్తోంది. 

లేటెస్ట్గా ఊర్వశి రౌతేలా..త్వరలో బాలయ్య సరసన కూడా నటించబోతోందట! ఇప్పటికే ఊర్వశి రౌతేలా..అఖిల్ తో ఏజెంట్, పవన్ కళ్యాణ్ బ్రో, రామ్ స్కంద మూవీస్ లో ఆడిపాడి కుర్రకారుకి పిచ్చెక్కేలా చేసింది. ఇంకా మాస్ బాలయ్య తో ఊర్వశి అంటే..మాస్ పల్స్రేట్ పడిపోవటమో..పెరగటమో  కన్ఫమ్. వీరసింహ రెడ్డిలోని మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయి..సాంగ్ తో వచ్చిన హనీ రోజ్ పై బాలయ్య ఫ్యాన్స్ మనసు పారేసుకున్నారు. ఇక ఊర్వశి తో స్పెషల్ సాంగ్ పడితే ఉంటారా..నర నరాలు ఉడికిపోవడమే అన్నమాట.  

ఇప్పటికే ఊర్వ‌శి రౌతేలా..మెగాస్టార్ చిరంజీవి న‌టించిన వాల్తేరు వీర‌య్య‌`లో `బాస్ పార్టీ సాంగ్ చార్ట్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. లెజెండ‌రీ డ్యాన్సింగ్ స్టార్ చిరుతో తన డ్యాన్స్ మూవ్‌లను ప్రదర్శించే అరుదైన అవ‌కాశం అందుకున్న సంగతి తెలిసిందే. ఈ అవ‌కాశం వచ్చినందుకు మెగాస్టార్ - బాబి స‌హా మెగాభిమానుల‌కు చాలా కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఇప్పుడు `బాస్ పార్టీ..`లో అవ‌కాశం క‌ల్పించిన బాబి మ‌రోసారి ఊర్వ‌శికి అవ‌కాశం క‌ల్పించార‌ని సమాచారం. 

నంద‌మూరి బాల‌కృష్ణ‌తో బాబి ఓ భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ ఇటీవ‌ల‌ ఊటీలో జ‌రుగుతోంది. ఇందులో ఊర్వ‌శి కేవ‌లం ఐట‌మ్ సాంగ్ వరకేనా..? లేక ఏవైనా సీన్ల‌లో న‌టిస్తుందా? అన్న‌ది తెలియాల్సి ఉంది. ఈ మూవీలో బాలయ్య సరసం మీనాక్షి చౌదరి తో తో పాటు మరో హీరోయిన్ నటిస్తోన్నట్లు సమాచారం. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా NBK 109 మూవీని నిర్మిస్తున్నాయి.