
‘వార్ 2’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీఆర్... ఇటీవలే ఈ మూవీ సెట్స్‌లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమా షూట్ కోసం ముంబైలో ఉన్న ఎన్టీఆర్‌ను జిమ్‌లో కలిసి ఇలా సెల్ఫీ తీసుకుంది ఊర్వశి రౌతేలా. ‘‘మా నిజమైన గ్లోబల్ సూపర్‌స్టార్ ఎన్టీఆర్ గారు . క్రమశిక్షణ, నిజాయితీ, ముక్కుసూటితనం, వినయం కలిగిన మంచి మనిషి. మీరు ఇచ్చిన మోటివేషన్‌కి చాలా థ్యాంక్స్.
నిజంగా మీది లయన్ హార్టెడ్ పర్సనాలిటీ. త్వరలో మీతో కలిసి పని చేయడానికి ఎదురుచూస్తున్నా” అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిందామె. బహుశా.. ‘వార్ 2’లో ఎన్టీఆర్ లుక్ రివీల్ కాకూడదని కాబోలు.. ఈ సెల్ఫీలో ఎన్టీఆర్ ఫేస్‌కు ఏదో ఫిల్టర్ వాడినట్టుంది ఊర్వశి. దీంతో చిన్న కుర్రాడిలా, యంగ్‌గా కనిపిస్తున్నాడు ఎన్టీఆర్. ఇక వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద చిత్రాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఆమె, ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా బాబీ తీస్తున్న చిత్రంలో కీలకపాత్ర పోషిస్తోంది.