
హైదరాబాద్, వెలుగు: ఐటీ సేవలు అందించే అమెరికా కంపెనీ సెరెమోర్ఫిక్ తన మొదటి డెవెలప్మెంట్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలో ఈ ఆఫీసును 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కంపెనీలో 140 మంది ఎంప్లాయిస్ఉన్నారు. 2024 నాటికి వీరి సంఖ్య 400లకు పెంచుతామని కంపెనీ ఫౌండర్, సీఈఓ మట్టెల వెంకట్చెప్పారు. తమకు దాదాపు వందకు పైగా పేటెంట్లు ఉన్నాయని, సిలికాన్ సిస్టమ్స్ లో నైపుణ్యం ఉందని అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), హై పవర్ కంప్యూటింగ్ (హెచ్‌పీసీ), ఆటోమోటివ్ ప్రాసెసింగ్, డ్రగ్ డిస్కవరీ, మెటావర్స్ ప్రాసెసింగ్ టెక్నాలజీలకు అనువుగా ఉండే పూర్తిస్థాయి సిలికాన్ సిస్టమ్ ను అందిస్తామని ఆయన చెప్పారు. అత్యాధునిక సిలికాన్ జామెట్రీ (టీఎస్ఎంసీ 5ఎన్ఎం నోడ్)తో డిజైన్ చేసిన కొత్త ఆర్కిటెక్చర్ ను సెరెమోర్ఫిక్ డెవెలప్ చేసింది. హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. అల్ట్రా లో పవర్ ట్రైనింగ్ సూపర్ కంప్యూటింగ్ చిప్‌ను కూడా డిజైన్ చేసేందుకు హైదరాబాద్ టీమ్ ప్రయత్నిస్తోందని వెంకట్ వెల్లడించారు