న్యూఢిల్లీ: భారత్‌తో యుద్ధం చేయడం వల్ల పాకిస్తాన్‌కు ఎలాంటి ప్రయోజనాలు లేవని అమెరికా మాజీ సీఐఏ(సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) ఆఫీసర్ జాన్కిరియాకౌ అన్నారు. భారత్‌తో జరిగే ఏ యుద్ధంలోనైనా పాక్ కచ్చితంగా ఓడిపోతుందని వెల్లడించారు. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన..పాక్, అమెరికా మధ్య జరిగిన ఆసక్తికర విషయాలను తెలియజేశారు.
భారత్‌తో యుద్ధం చేస్తే పాకిస్తాన్‌కు ఒరిగేదేమి ఉండదు. ఎందుకంటే పాకిస్తానీలే ఓడిపోతారు. భారత్‌ను రెచ్చగొట్టడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. జమ్మూకాశ్మీర్‌లో జరిగిన ఉగ్ర దాడులకు ప్రతీకారంగా 2016లో ఎల్ఓసీ సమీపంలోని ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రయిక్ చేసింది.
ఆ తర్వాత 2019లో బాలకోట్లో ఎయిర్ స్ట్రయిక్ నిర్వహించింది. అలాగే, ఈ ఏడాది ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్తానీ ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసింది. ఇలా, టెర్రర్ అటాక్స్ తర్వాత భారత్ చాలా నిర్ణయాత్మకంగా వ్యవహరించింది" అని జాన్కిరియాకౌ వివరించారు.
