64 దేశాలకు అమెరికా లక్షా 30 వేల కోట్ల సాయం

64 దేశాలకు అమెరికా లక్షా 30 వేల కోట్ల సాయం

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ పనిబట్టడానికి అమెరికా మరోసారి భారీ మొత్తాన్ని సాయంగా ప్రకటించింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న 64 దేశాలకు 17.4 కోట్ల డాలర్ల  (రూపాయల్లో లక్షా 30 వేల కోట్లు) ఆర్థిక సాయం ఎనౌన్స్​చేసింది.  పోయిన నెలలో  100 మిలియన్‌ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ఈ తాజా ప్రకటనతో అమెరికా సాయం 27.4 కోట్ల డాలర్లకు చేరింది. కరోనా వైరస్​  వ్యాప్తి నివారణకు పని చేస్తున్న

డిసీజ్‌ కంట్రోల్‌,‌ ప్రివెన్షన్‌ సెంటర్స్ (సీడీసీ)తోపాటు ఇతర సంస్థలకు నిధులు సమకూరనున్నాయి. గ్లోబల్‌ ప్యాకేజీ కింద మనదేశంతో పాటు సార్క్ దేశాలైన నేపాల్, అఫ్ఘానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లకుకూడా ఆర్థిక సాయం అందనుంది. మనదేశంలో కరోనా కేసులపై నిఘా, పరిశీలన, టెక్నాలజీ డెవలప్మెంట్, లేబొరేటరీల ఏర్పాటు మొదలైన పనులకుగాను రెండు మిలియన్ డాలర్లు (రూపాయల్లో దాదాపు 16 కోట్లు) సాయం అందుతుంది. ఇక,  శ్రీలంకకు 10.3 లక్షల‌ డాలర్లు, నేపాల్‌కు 10.8 లక్షలు‌, బంగ్లాదేశ్‌కు 30.4 లక్షలు‌, అఫ్ఘానిస్థాన్‌కు 50 లక్షల‌ డాలర్లు గ్లోబల్‌ ప్యాకేజీ ద్వారా అందుతాయని అమెరికా తెలిపింది.

ఓల్డ్ సిటీలో నకిలీ శానిటైజర్స్ ముఠా అరెస్ట్