1616 మంది ఇండియన్లను వెనక్కి పంపిన అమెరికా

1616 మంది ఇండియన్లను వెనక్కి పంపిన అమెరికా

అమెరికా పెద్ద సంఖ్యలో ఇండియన్లను వెనక్కు పంపింది. వలస చట్టాలను ఉల్లంఘించినందుకు గానూ గత ఏడాది 1,616 మందిని వాపస్ పంపించింది అమెరికా. అంతేగాకుండా 8,447 మందిని అదుపులోకి తీసుకుంది.వాళ్లంతా యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్ మెంట్ (ఐ సీఈ) డిటెన్షన్ సెంటర్లలో ఉన్నట్టు చెప్పింది. గత నెలలో ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యాక్ట్​ (ఎఫ్ వోఐఏ) కింద ఈ వివరాలను అమెరికా వెల్లడించింది. 2018లో 359 మంది అమ్మాయిలు సహా 9,818 మందిని అదుపులో తీసుకోగా, 611మందిని తిప్పి పంపింది. ఈ ఏడాది దానికి రెట్టిం పు సంఖ్యలో ఇండియన్లను వెనక్కు పంపింది అమెరికా. దీనికి సంబంధించి జనవరి 30న ఎఫ్ వోఐఏ ఆఫీసర్ కట్రినా ఎం. పావ్లిక్ కీనన్ ఓ స్టేట్ మెంట్ విడుదల చేశారు.

అబ్బాయిలే ఎక్కువ

గత ఏడాది 8,447 మందిని ఐసీఈ అదుపులోకి తీసుకుంటే అందులో 422 మంది మహిళలు కాగా,8,022 మంది మగవాళ్లున్నట్టు ఐసీఈ చెప్పింది. ఇంకో ముగ్గురి జెండర్ పై స్పష్టత లేదని వెల్లడించింది. ఇది 2014తో పోలిస్తే దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ. ఆ ఏడాది 2,306 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఏటేటా ఇలా ఇమిగ్రేషన్ రూల్స్ కు విరుద్ధంగా వెళ్లి డిటెయిన్ అయిన ఆడవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ‘‘అమెరికాలో భారత్ కు చెందిన అక్రమ వలసదారులు పెరిగిపోతుండడం ఇటు అమెరికా,అటు ఇండియాను కలవర పరిచే అంశం. పంజాబ్ కు చెందిన వాళ్లు మెక్సి కో సరిహద్దుల నుంచి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. కొన్నికొన్నిసార్లు అది వాళ్ల ప్రాణాల మీదకు తెస్తోంది’’ అని కట్రినా చెప్పారు. గత ఏడాది జూన్ లో అరిజోనాలో ఆరేళ్ల హర్యానా చిన్నారి చనిపోయిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఉన్న తన భర్త దగ్గరకు పోయే క్రమంలో ఓ మహిళ మెక్సికో నుంచి అమెరికాలోకి అక్రమంగా వెళ్లేందుకు ప్రయత్నించింది. తన కూతురును కోల్పోయింది. అదే ఏడాది జులైలో పంజాబ్ కు చెందిన వాళ్లు తమ పిల్లలతో కలిసిమెక్సికో అమెరికా బార్డర్ ను దాటేందుకు ప్రయత్నిస్తున్న మరో వీడియో కూడా వైరలైంది. ఈ నేపథ్యంలోనే 2014 నుంచి 2019 మధ్య తిప్పి పంపిన ఇండియన్ల వివరాలు కోరుతూ నార్త్​ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (నాపా), ఐసీఈకి గత ఏడాది నవంబర్ 2న రిక్వెస్ట్​ పెట్టింది. ఈ ఏడాది జనవరి 30న ఐసీఈ ఆవివరాలు వెల్లడించింది.