అలెంబిక్, డాక్టర్ రెడ్డీస్‌కు గుడ్‌న్యూస్.. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి కీలక అనుమతులు!

అలెంబిక్, డాక్టర్ రెడ్డీస్‌కు గుడ్‌న్యూస్.. అమెరికా ఎఫ్‌డీఏ నుంచి కీలక అనుమతులు!

న్యూఢిల్లీ: భారత ఫార్మా కంపెనీలు అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌‌‌‌కు అమెరికా రెగ్యులేటరీ ఎఫ్‌‌‌‌డీఏ  నుంచి సానుకూల వార్తలు అందాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ చికిత్సలో వాడే 'బినిమెటినిబ్' (- 15 ఎంజీ, 45 ఎంజీ) ట్యాబ్లెట్లకు సంబంధించి యూఎస్‌‌‌‌ ఎఫ్‌‌‌‌డీఏ నుంచి అలెంబిక్ తుది అనుమతులు పొందింది.

అమెరికాలో దీనికి ఏడాదికి సుమారు 282 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 2,679 కోట్ల) మార్కెట్ విలువ ఉంది. ఈ మందు  అమ్మకాలపై అలెంబిక్‌‌‌‌కు 180 రోజుల పాటు ప్రత్యేక హక్కు  లభించింది. దీంతో కంపెనీ మొత్తం యూఎస్‌‌‌‌ ఎఫ్‌‌‌‌డీఏ అనుమతుల సంఖ్య 248కి చేరింది.

పూర్తయిన  రెడ్డీస్‌‌‌‌ ప్లాంట్ తనిఖీ  

హైదరాబాద్‌‌‌‌లోని బాచుపల్లిలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ఫార్ములేషన్స్ తయారీ ప్లాంట్  తనిఖీలను ఎఫ్‌‌‌‌డీఏ అధికారికంగా ముగించింది. దీనికి 'వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్'  హోదా ఇచ్చింది. అంటే, ప్లాంట్ కార్యకలాపాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవు.