ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్ మంటలకు వందల ఎకరాలు అడవిని నాశనం చేస్తున్నాయి. దీంతో ఇప్పటికే 480 మిలియన్లకు పైగా జంతువులు చనిపోయాయి. 900లకు పైగా గృహాలు ధ్వంసమయ్యాయి.
అయితే బుష్ ఫైర్ లో తీవ్రగాయాలపాలైన వన్యప్రాణుల కోసం, మంటల దాటికి సర్వస్వాన్ని కోల్పోయిన బాధితులకు అండగా నిలిచేందుకు పలువురు డొనేషన్లు కలెక్ట్ చేస్తున్నారు.
తాజాగా అమెరికాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ కెయెలన్ వార్డ్ (20)విరాళాలు సేకరించింది. ఎవరైతే 10డాలర్లకు తక్కువకాకుండా డొనేట్ చేస్తారో వారికి తన న్యూడ్ ఫోటోస్ పంపిస్తున్నట్లు యువతి చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. ట్వీట్ తో అమెరికాతో పాటు, ఇతర దేశాలకు చెందిన పలువురు విరాళాలు ఇచ్చినట్లు, సుమారు రెండు రోజుల పాటు రూ.5కోట్లు డోనేట్ కలెక్ట్ చేసినట్లు తెలిపింది.
తన ప్రకటనపై భారీగా డొనేషన్లు ఇవ్వడంపై వార్డ్ ఆనందంగా ఉన్నా..న్యూడ్ ఫోటోలు పంపడంపై ఆమె తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యూడ్ గా ఫోటోలు షేర్ చేయడంపై ఇన్ స్టాగ్రామ్ తన అకౌంట్ ను బ్లాక్ చేయడంతో మళ్లీ కొత్త అకౌంట్ ఓపెన్ చేసినట్లు మరో ట్వీట్ చేసింది.
అయితే వార్డ్ కలెక్ట్ చేసిన డొనేషన్ సొంత ప్రయోజనాలకోసం ఉపయోగించుకుంటుందని పలువురు నెటిజన్లు ట్వీట్ చేయడంపై ఆమె మండిపడింది. డొనేషన్లను దుర్వినియోగం చేయనని, ఆస్ట్రేలియాకు చెందిన ట్రస్ట్ ల ద్వారా కలెక్ట్ చేసిన మనీ మొత్తాన్ని పంపిస్తున్నట్లు వార్డ్ తెలిపింది.
INSTAGRAM DEACTIVED MY SECOND ACCOUNT. I don’t have an Instagram. None of these are real pic.twitter.com/YXDiGQJyAh
— THE NAKED PHILANTHROPIST (@lilearthangelk) January 5, 2020
