యాపిల్ కంపెనీపై యూఎస్ ప్రభుత్వం దావా వేసింది.. ఎందుకో తెలుసా?

యాపిల్ కంపెనీపై యూఎస్ ప్రభుత్వం దావా వేసింది.. ఎందుకో తెలుసా?

ఇటీవల అమెరికా ప్రభుత్వం ఐఫోన్ల తయారీ కంపెనీ యాపిల్ పై  కోర్టుకెళ్లింది.  స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో యాపిల్ అక్రమ గుత్తాధిపత్యం చెలాయిస్తోందని అమెరికా డిపార్ట్ మెంట్ జస్టిస్ (DoJ) లాసూట్ ను దాఖలు చేసింది.యాపిల్ తన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ వినియోగంలో అపరిమిత మినహాయింపు తో స్మార్ట్ ఫోన్ మార్కెట్ నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. 

i Message, Siri వంటి ఐఫోన్ ఫీచర్ల ను పోటీదారు స్మార్ట్ ఫోన్లకు యాక్సెస్ ను యాపిల్ నిరాకరిస్తుందని DoJ ఆరోపిస్తుంది. ఇది స్మార్ట్ ఫోన్ల్ పోటీ మార్కెట్ లో విరుద్ధమైనదని పేర్కొంది. యాపిల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అడ్డంకులను సృష్టిస్తోంది.. ఇది వినియోగదారులు, డెవలపర్లకు కష్టంగానూ, భారంగా మారుతోందని తెలిపింది. 

టెక్నాలజీల విస్తరణకు ఆటంకం కలిగించేందుకు యాపిల్ తన యాప్ స్టోర్, ప్రైవేట్ API లను ఉపయోగిస్తోంది.. దీనిని నిరోధించాలని DoJ అంటోంది. ఇందుకు ఆపిల్ భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుందని దావాలో పేర్కొంది. 

అయితే యాపిల్ కంపెనీ వాదన మరోలా ఉంది. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో తమ కంపెనీ పేరును చెడగొట్టేందుకు అమెరికా ప్రభుత్వం లాసూట్ వేసిందని..ఐఫోన్ నుంచి ఆండ్రాయిడ్ కు అమెరికా మారేందుకు ప్రయత్నిస్తుందని యాపిల్ సంస్థ వాదిస్తోంది.