వాలంటైన్స్ డే.. మాజీ ప్రేయసిని కిడ్నాప్ చేసిన యువకుడు

వాలంటైన్స్ డే.. మాజీ ప్రేయసిని కిడ్నాప్ చేసిన యువకుడు

యునైటెడ్ స్టేట్స్: ప్రేమికుల రోజున త‌న‌తో క‌ల‌సి బ‌య‌ట‌కు రావ‌డానికి నిరాక‌రించింద‌ని ఓ వ్య‌క్తి త‌న మాజీ ప్రేయ‌సిని కిడ్నాప్ చేశాడు. ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లి అయిన ఆమెను కొట్టి బ‌ల‌వంతంగా కారులో ఎక్కించుకొని పారిపోయాడు. ఈ విష‌యంపై బాధితురాలి త‌ల్లి ఫిర్యాదు చేయ‌డంతో అత‌న్ని అరెస్ట్ చేశారు పోలీసులు. యూఎస్ లో ఫీనిక్సో లోని అరిజోనా ప్రాంతంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది‌.

యెష‌యా క‌స్పార్డ్(20) అనే యువ‌కుడు ఈ నెల 10 వ తేదిన త‌న మాజీ ప్రియురాలిపై దాడి చేశాడు. దీంతో పోలీసులు అతన్ని ఆ స‌మ‌యంలో అరెస్ట్ చేసి ఆ తరువాత విడుదల చేశారు. త‌ర్వాతి రోజున ఆ యువకుడు తన ప్రేయసి భ‌ర్త లేని స‌మ‌యంలో ఆమె ఇంటికి వెళ్లి.. త‌న‌తో వాలంటైన్స్ డే రోజున బ‌య‌ట‌కు రావాల్సిందిగా కోరాడు. దీనికి ఆమె నిరాక‌రించ‌డంతో ఆమెను కొట్టి బలవంతంగా తన కారులో ఎక్కించుకొని 100 మైళ్ళ వేగంతో పారిపోయాడు. బాధితురాలి త‌ల్లి, పొరుగు వారు ఈ విష‌యంపై పోలీసుల‌కు  ఫిర్యాదు చేయ‌డంతో వారు నిందితుడిని అరెస్టు చేశారు. అత‌న్ని ప్ర‌స్తుతం $ 6,000 బాండ్‌పై కౌంటీ జైలులో ఉంచారు.