
అమెరికాలోని మరోసారి భారీ కాల్పులు సంచలనం సృష్టించాయి. ఒక వ్యక్తి డిసెంబర్ 11న లాస్‌వేగాస్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో తనను తాను కాల్చుకునే ముందు ఒక మహిళ, ఇద్దరు పిల్లలను కాల్చి చంపాడు. మరో చిన్నారిని తీవ్రంగా గాయపరిచాడు. యూనివర్శిటీ ఆఫ్ నెవాడా, లాస్ వెగాస్‌లో ముగ్గురు ప్రొఫెసర్‌లను ఓ సాయుధుడు కాల్చి చంపిన కొద్ది రోజుల తర్వాత ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
కాల్పులు జరిపిన వ్యక్తికి, బాధితులకు సంబంధం ఉందో లేదో ఇంకా తెలియదని పోలీసులు అన్నారు. యూనివర్శిటీ ఆఫ్ నెవాడా, లాస్ వెగాస్‌కు వాయువ్యంగా 40 నిమిషాల డ్రైవ్‌లో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఈ కాల్పులు జరిగాయి. అక్కడ ఓ వ్యక్తి వారం రోజుల కింద క్యాంపస్‌లోకి వెళ్లి బిజినెస్ స్కూల్ ఉన్న భవనంలో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు ఫ్యాకల్టీ సభ్యులు మరణించారు, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. .
UNLV, ఇతర నెవాడా కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో టీచింగ్ ఉద్యోగం కోసం అతను తిరస్కరించబడినట్లు అధికారులు తెలిపారు. నార్త్ కరోలినాలో దీర్ఘకాల వ్యాపార ప్రొఫెసర్ అయిన ఆంథోనీ పొలిటోగా కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. యూనివర్సిటీ పోలీసులతో జరిగిన కాల్పుల్లో పొలిటో కూడా చనిపోయాడు.