ప్రచార కార్యక్రమంలోనే నిన్ను చంపేస్తా .. వివేక్ రామస్వామికి బెదిరింపులు

ప్రచార కార్యక్రమంలోనే నిన్ను చంపేస్తా .. వివేక్ రామస్వామికి బెదిరింపులు

వాషింగ్టన్: రిపబ్లిక్ పార్టీ తరఫున అమెరికా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేస్తున్న వివేక్ రామస్వామిని చంపేస్తానని ఓ వ్యక్తి బెదిరించాడు. ఆయన పాల్గొనే ఈవెంట్​కు వచ్చి ప్రాణాలు తీస్తానని, ఆ కార్యక్రమం లో పాల్గొనేవాళ్లను మట్టుబెడతాన ని మెస్సేజ్ పంపాడు.

దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అతడి ని న్యూ హాంప్​షైర్​కు చెందిన 30 ఏండ్ల టైలర్ ఆండర్సన్​గా గుర్తించి అరెస్ట్ చేశారు. వివేక్ రామస్వామి ప్రచారంలో భాగంగా తాను చేపట్ట బోయే కార్యక్రమాల గురించి ఓటర్ల కు మెస్సేజ్​ పంపించారు. దీనికి వందలాదిమంది రిప్లయ్ ఇచ్చారు. ఆండర్సన్​ మాత్రం రామస్వామిని చంపుతానని సందేశం పంపాడు.