సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం

సముద్రంలోకి దూసుకెళ్లిన విమానం

వాషింగ్టన్: యూఎస్ నేవీకి చెందిన  పీ-8ఏ పొసైడాన్‌‌ విమానం రన్ వే పై నుంచి అదుపు తప్పి సముద్రంలోకి దూసుకెళ్లింది. సోమవారం హవాయిలోని మెరైన్ కోర్ బేస్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు.

ప్రమాదం జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది స్పందించడంతో  ప్లేన్ లోని 9 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. విజిబిలిటీ తక్కువగా ఉండటంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని  వెదర్ ఎక్స్ పర్ట్ థామస్ వాన్ చెప్పారు.