iPhone News: ఇండియాలో ఐఫోన్స్ తయారు చేస్తే 25 శాతం సుంకం కట్టాల్సిందే: ఆపిల్‌కి ట్రంప్ వార్నింగ్

iPhone News: ఇండియాలో ఐఫోన్స్ తయారు చేస్తే 25 శాతం సుంకం కట్టాల్సిందే: ఆపిల్‌కి ట్రంప్ వార్నింగ్

Trump warns Apple: ఇటీవల కొన్ని రోజుల కిందట అమెరికా అధ్యక్షుడు ఖతార్ పర్యటనలో ఉన్నప్పుడు దోహాలో మాట్లాడుతూ ఆపిల్ తన ఐఫోన్ల తయారీని ఇండియాలో విస్తరించటం తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పారు. అదే విషయాన్ని కంపెనీ సీఈవో టిమ్ కుక్ కి కూడా స్పష్టం చేసినట్లు వెల్లడించారు. ఇండియా తన ప్రజల గురించి చూసుకుంటుందిలే అంటూ ఉచిత సలహా కూడా ఇచ్చారు. అయితే కరెక్టుగా వారం తిరగ్గానే ఇదే విషయంపై ట్రంప్ మరోసారి సీరియస్ వార్నింగ్ ఇవ్వటం ఆందోళనలు సృష్టిస్తోంది. 

ప్రస్తుతం ట్రంప్ చర్యలు చూస్తుంటే ఇండియాపై పగబట్టినట్లు కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి ట్రంప్ పైకి ఇండియా గురించి మాట్లాడుతోంది ఒకటి కానీ వాస్తవానికి చేస్తున్నది మరొకటిగా ఉందని చాలా మంది నిపుణలు అంటున్నారు. అమెరికాతో ఆపిల్ అమ్ముతున్న ఐఫోన్లను ఆ దేశంలోనే తయారు చేయకపోతే వాటి అమ్మకాలపై అదనంగా 25 శాతం సుంకం చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ తేల్చి చెప్పేశారు. 

ALSO READ | విదేశీ విద్యార్థులకు ట్రంప్ మరో బిగ్ షాక్.. హార్వర్డ్​ వర్సిటీలో ఫారెన్​ స్టూడెంట్లకు నో ఎంట్రీ

ట్రంప్ తన సోషల్ మీడియా ఫ్లాట్ ఫారం ట్రూత్ లో దీనికి సంబంధించి కీలక పోస్ట్ పెట్టారు. తాను ఆపిల్ సీఈవో టిమ్ కుక్ కి చాలా కాలం కిందటే అమెరికాలో అమ్ముడయ్యే ఐఫోన్లు భారతదేశంలో కాకుండా.. స్థానికంగా తయారు చేయాలని కోరుకుంటున్నట్లు ట్రంప్ అన్నారు. ప్రపంచం మరే ఇతర దేశం నుంచి కూడా వాటిని తయారు చేయించి దిగుమతు చేయవద్దని చెప్పారు. తన మాట బేఖాతరు చేస్తే.. తక్కువలో తక్కువ ఆపిల్ తన ఉత్పత్తులపై 25 శాతం సుంకం అమెరికాకు చెల్లించాలని అన్నారు. దీనిపై టిమ్ కుక్ త్వరలోనే దృష్టి సారించాలని కోరుతున్నట్లు పోస్టులో హెచ్చరించారు. 

వాస్తవానికి ట్రంప్ చేసిన ఈ కామెంట్స్ కారణంగా అమెరికా స్టాక్ మార్కెట్లలో ఆపిల్ స్టాక్ ధర ఏకంగా 3 శాతం నష్టాన్ని నమోదు చేసింది. కొన్ని వారాల కిందట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ దేశాలపై సుంకాల సమయంలో చైనాకు భారీగా టారిఫ్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఆపిల్ అమెరికాకు షిప్పింగ్ చేసే ఆపిల్ ఉత్పత్తుల తయారీని చైనాలో తగ్గించి ఇండియాకు మార్చిన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఇండియా నుంచి చేసే ఎగుమతులపై తక్కువ సుంకం అమలులో ఉండటంతో ఈ మార్పులకు ఆపిల్ నిర్ణయించింది. అలాగే చైనాలో తయారయ్యే ఆపిల్ ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలకు షిప్పింగ్ చేస్తోంది. కానీ ప్రస్తుతం ట్రంప్ సీరియస్ వార్నింగ్స్ ఇవ్వటంతో ఇండియాలో ఉత్పత్తి విస్తరణ ప్రణాళికలపై ఆపిల్ సంస్థ డైలమాలో ఉన్నట్లు తెలుస్తోంది.