పుతిన్ యుద్ధ నేరస్థుడు.. అమెరికా సెనేట్ తీర్మానం

పుతిన్ యుద్ధ నేరస్థుడు.. అమెరికా సెనేట్ తీర్మానం

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను ఖండిస్తూ అమెరికా సెనేట్ తీర్మానం చేసింది. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను యుద్ధ నేరస్థుడంటూ పెట్టిన తీర్మానానికి అమెరికా సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మంగళవారం సమావేశమైన సెనేట్‌లో రిపబ్లికన్‌ సెనేటర్‌‌ లిండ్సే గ్రాహం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. ఇటు రిపబ్లికన్లు, అటు డెమోక్రాట్లు రెండు పక్షాలు సమర్థించాయి. ఉక్రెయిన్ ప్రజలపై రష్యన్ బలగాలు చేస్తున్న దురాగతాలకు పుతిన్ జవాబుదారీ వహించాలని, ఆయనను యుద్ధ నేరస్థుడిగా ఇంటరాగేట్ చేయాలని సెనేట్‌లోని ప్రతినిధులంతా అభిప్రాయపడ్డారని డెమోక్రటిక్ పార్టీ సెనేటర్ చుక్ షూమర్ అన్నారు. ది హేగ్‌లోని ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఇతర దేశాలు కూడా పుతిన్‌ యుద్ధ నేరాలపై ఇన్వెస్టిగేషన్ చేయాలని తీర్మానంలో పెట్టినట్లు చెప్పారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో సెనేట్‌లోని సభ్యులంతా తీర్మానానికి ఆమోదం తెలిపారని అన్నారు.

ఫిబ్రవరి 24న రష్యా అకస్మాత్తుగా ఉక్రెయిన్‌పై మిలిటరీ ఆపరేషన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌ను ఆర్మీ రహితంగా చేయడమే తమ టార్గెట్ అని, సైనిక స్థావరాలు, మిలిటరీ ఎస్టాబ్లిస్‌మెంట్లపైనే తాము దాడులు చేస్తామని ఆ రోజున రష్యా ప్రెసిడెంట్ పుతిన్ ప్రకటించారు. కానీ పోనుపోనూ పలు సిటీల్లో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులు, అపార్ట్‌మెంట్లపైనా రష్యన్ సైన్యం దాడులకు పాల్పడడం మొదలుపెట్టింది. రష్యా యుద్ధ బీభత్సంలో ఇప్పటికే వేల మంది పౌరులు మరణించారని ఉక్రెయిన్‌ చెబుతోంది. వేల మంది సామాన్యుల ప్రాణ నష్టానికి కారణమైన రష్యన్ ప్రెసిడెంట్‌ పుతిన్‌ను యుద్ధ నేరస్థుడిగా తీర్మానించింది అమెరికా.

మరిన్ని వార్తల కోసం..

కేసీఆర్ ఏ వర్గానికీ న్యాయం చేయలేదు

ఉక్రేనియన్లకు ఐదేళ్ల చిన్నారి సాయం

చైనాలోని 13 సిటీల్లో పూర్తి లాక్‌‌‌‌డౌన్‌‌‌‌