
తైపి: తైవాన్‌కు అమెరికా మద్దతు ఎప్పుడూ ఉంటుందని, చైనాతో పోరాటంలో తాము కూడా భాగస్వాములు అవుతామని యూఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ అన్నారు. మంగళవారం రాత్రి తైవాన్‌లో అడుగుపెట్టిన ఆమె.. బుధవారం ఉదయం ఆ దేశ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్‌తో భేటీ అయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో నాన్సీ మాట్లాడారు. చైనా ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
తైవాన్‌కు అమెరికా అండగా ఉందని నిరూపించేందుకు టీంతో కలిసి ఇక్కడికి వచ్చినట్టు తెలిపారు. కాగా, నాన్సీ పర్యటన కారణంగా చైనా తమపై ఒత్తిడి పెంచిందని తైవాన్ ప్రెసిడెంట్ త్సాయి యింగ్ చెప్పారు. అయితే, బెదిరింపులకు తలొగ్గేదిలేదని ఆమె స్పష్టం చేశారు. మరోవైపు, చైనాను అవమానపర్చేలా వ్యవహరిస్తే.. ఏ దేశాన్ని అయినా శిక్షిస్తామని చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యి తేల్చిచెప్పారు.