
ఇటీవల బెంగళూరులోని ఓ షాపింగ్ మాల్ లో గోచి కట్టుకొని వచ్చిన రైతును మాల్ లోకి అనుమతించకపోవటం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే.ఆ వివాదం మాల్ మూసివేతకు దారి తీసింది. తాజాగా అమెరికాలోని ఓ రెస్టారెంట్లో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ వేసుకున్న డ్రెస్ కారణంగా ఆమెను రెస్టారెంట్లో నుండి బయటకు పంపారు. సదరు మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది.
మినీ మ్యాక్ అనే మహిళ తాను వేసుకున్న డ్రెస్ కారణంగా రెస్టారెంట్ లోకి అనుమతించలేదంటూ పేస్ బుక్ లో పోస్ట్ చేసింది. ఇదే డ్రెస్ వేసుకొని గతంలో చాలా సార్లు రెస్టారెంట్ కి వెళ్లానని, కానీ ఇప్పుడు అభ్యంతరం చెప్తున్నారంటూ పోస్ట్ లో చెప్పుకొచ్చింది.ఆ పోస్ట్ తో పాటు వీడియో కూడా షేర్ చేసింది మ్యాక్. ఆ వీడియోలో రెస్టారెంట్ ఓనర్ మ్యాక్ డ్రెస్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు కూడా స్పష్టంగా అర్థమవుతోంది.సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవ్వగా.. డ్రెస్ కారణంగా వివక్ష చూపటం సరికాదని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.