బైక్ మైలేజ్ పెరగాలంటే..గేర్లు, బ్రేకులు ఇలా ఉపయోగించండి

బైక్ మైలేజ్ పెరగాలంటే..గేర్లు, బ్రేకులు ఇలా ఉపయోగించండి

బైక్ నడపడం అనేది ఓ కళ. చాలామంది తమ మోటార్ బైక్ కొత్తదైనా మైలేజ్ ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేయడం తరుచుగా వింటుంటాం. అయితే బైక్ నడుపుతున్నపుడు కొన్ని తప్పులు చేయడం వల్ల మైలేజీ తగ్గుందని బైక్ నిపుణులు చెబుతున్నారు. బైక్ నడుపుతున్నపుడు ఈవిషయాలపై శ్రద్ద వహించాలంటున్నారు. 

సరైన వేగంతో గేర్ మార్చకపోవడం

బైక్ నడుపుతున్నపుడు బైక్ వేగానికి తగ్గట్టుగా గేర్ మార్చడం చాలా ముఖ్యం. మెయిన్ రోడ్డు(పెద్ద రోడ్లు, రహదారులు) లపై అధిక వేగంతో బైక్ ను నడుపుతుంటే , వేగాన్ని స్థిరంగా ఉంచాలనుకుంటే, బైక్ ని ఎక్కువ గేర్ లో నడపాలి. దీని వల్ల ఇంజిన్ పై పెద్దగా ఒత్తిడి ఉండదు. బైక్ మంచి మైలేజ్ ఇస్తుంది. అలాగే తక్కువ వేగంతో నడపాల్సి వస్తే రెండు లేదు మూడో గేర్ లో బైక్ ని నడపాలి. ఇలా చేయడం వల్ల బైక్ తక్కువ వేగంతో ఆగదు, బైక్ కు నిరంతర విద్యుత్ సరఫరా కారణంగా పెట్రోల్ ఆదా అవుతుంది. 

రైడింగ్ చేసేటప్పుడు ఎప్పుడూ కాలు బ్రేక్ పైనే ఉండాలి 

బైక్ నడుపుతున్నపుడు చాలా మంది బ్రేక్ పై కాలు ఉంచుతారు. బ్రేక్ పై కాలు పెట్టి డ్రైవింగ్ చేయడం చెడ్డ అలవాటు కాదు.. ఇది వెంటనే బ్రేక్ వేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఎల్లప్పుడు బ్రేక్ లపై ఎల్లప్పుడు ఒత్తిడి ఉంచినట్లయితే బ్రేక్ అప్లయ్ కావడంతో బైక్ స్వేచ్చగా ముందుకు కదలదు. ఇలా చేయడం వల్ల బైక్ నడపడానికి ఎక్కువ యాక్సిలేటర్ ఇవ్వాలి.. బైక్ ఎక్కువ పెట్రోల్ తీసుకోవడం జరుగుతుంది. 

టైర్ లో తక్కువ గాలి 

టైర్లలో తక్కువగా గాలి ఉండటం వల్ల బైక్ మైలేజ్ కూడా క్షీణిస్తుంది. మెరుగైన మైలేజీ కోసం టైర్ లో సరిపోను గాలి ఉందో లేదో ఎల్లప్పుడు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అన్ని పెట్రోల్ పంపులు ఎయిర్ ప్రెజనర్ మెషీన్ సదుపాయాన్ని కలిగి ఉంటాయి. సో.. ఈ జాగ్రత్తలు పాటిస్తూ.. మీరు బైక్ నడిపితే మీ బండి ఇంజిన్ సేఫ్.. మైలేజీ వస్తుంది.

Also Read : రెండు బ్లడ్ బ్యాంకుల లైసెన్స్ రద్దు