ఇకపై ఈ బ్యాంకుల నుంచే ఫాస్ట్ టాగ్ కొనుగోలు చేయాలి

ఇకపై ఈ బ్యాంకుల నుంచే ఫాస్ట్ టాగ్ కొనుగోలు చేయాలి

ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ సేవలు రద్దు చేస్తూ జనవరి 31న ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లో చాలా మంది ఫాస్ట్ టాగ్ కస్టమ ర్స్ఉన్నారు. ఆర్బీఐ ఈ నిర్ణయంతో పేటీఎం పేమెంట్స్ లో ఫాస్ట్ టాగ్ వినయోగించే వారు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో యూజర్స్ పేటీఎం ఫాస్ట్ టాగ్ ను డీయాక్టివేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (IHMCL) అధికారిక X ఖాతాలో కీలక ప్రకటన చేసింది. 

ఫిబ్రవరి 16వ తేదీ నుంచి  ఫాస్ట్ టాగ్ యూజర్లు 32 ఆథరైజ్డ్ బ్యాంకుల ద్వారానే ఫాస్ట్ టాగ్ కొనుకోలు చేయాలని స్పష్టం చేసింది. వాటిలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు ఎస్ బ్యాంక్ ఉన్నాయి. NHAI టోన్ కలెక్టింగ్ డిపార్ట్ మెంట్ ఫ్యూచర్ లో ఫాస్ట్ టాగ్ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆ నిర్ణయం తీసుకుందని తెలిపింది. 

2021 ఫిబ్రవరి 15 నుంచి ఇండియాలో వెహికల్స్ కు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి చేశారు. ఇండియాలో 98 శాతం వాహనదారులు.. 8 కోట్ల మంది ఫాస్ట్ టాగ్ ద్వారా టోల్ గేట్ ఫీజ్ చెల్లిస్తున్నారు. 

ALSO READ :- బెల్లంపల్లిలో పదేండ్లుగా రూపాయి అభివృద్ది జరగలేదు : గడ్డం వినోద్