విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్​ వాడకం

విచ్చలవిడిగా యాంటీబయోటిక్స్​ వాడకం

టాప్​లో అజిత్రోమైసిన్​: లాన్సెట్​ స్టడీ

న్యూఢిల్లీ: ఇండియన్లు అధిక మోతాదులో యాంటీబయోటిక్స్​ వాడుతున్నారని లాన్సెట్​స్టడీలో బయటపడింది. కరోనాకు ముందు, కరోనా టైమ్​లో ఈ యాంటీబయోటిక్స్​ను మనోళ్లు చాలా ఎక్కువగా వాడారని తేల్చింది. ఇండియన్లు వాడిన డ్రగ్స్​లో ఎక్కువగా కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థల ఆమోదం పొందలేదని లాన్సెట్​ పరిశోధకులు చెప్పారు. విచ్చలవిడిగా సాగుతున్న యాంటీబయోటిక్స్​ వాడకాన్ని నియంత్రించేందుకు ఓ విధానం అవసరమని సూచించారు. యాంటీబయోటిక్స్​ వాడకం ఇట్లనే కొనసాగితే జనాలలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని హెచ్చరించింది. ‘‘ జాతీయ, రాష్ట్ర స్థాయిలో నియంత్రణ సంస్థల మధ్య సమన్వయంలేక యాంటీబయోటిక్స్​ వాడకం బాగా పెరిగింది. ఇండియాలో 2019లో 5,071 మిలియన్ల డ్రగ్స్​ వినియోగం జరిగినట్లు ఫార్మా ట్రాక్​ కంపెనీ డేటాతో తెలుసుకున్నాం. వాటిలో 640 మిలియన్​డోసులతో అజిత్రోమైసిన్​ టాప్​లో ఉంది” అని లాన్సెట్​ పరిశోధకులు తెలిపారు.