ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి 19న అప్‌‌డేట్

ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి 19న అప్‌‌డేట్

పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ సర్‌‌ప్రైజింగ్ అప్‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెబుతున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ..  ‘ఎక్స్‌‌పెక్ట్ ది అన్‌‌‍ ఎక్స్‌‌పెక్టెడ్’ అంటూ మార్చి 19 డేట్‌‌తో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌‌ను బట్టి మూవీ టీజర్‌‌ను‌‌ విడుదల చేయబోతున్నట్టుగా అర్థమవుతోంది.

ఓవైపు ఏపీ ఎన్నికలకు సంబందించిన నోటిఫికేషన్‌‌ రావడంతో ఇప్పుడప్పుడే పవన్ కళ్యాణ్​ సినిమాల నుంచి ఎలాంటి అప్‌‌డేట్స్ ఉండవనుకున్నారు అభిమానులు. కానీ అందరినీ సర్‌‌ప్రైజ్ చేస్తూ వీడియో గ్లింప్స్ వస్తుండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మరోవైపు ‘ఓజీ’ గ్లింప్స్ కూడా రెడీ అవుతోంది. సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు.. విలన్‌‌గా నటిస్తున్న ఇమ్రాన్‌‌ హష్మి బదులిస్తూ, త్వరలోనే గ్లింప్స్ విడుదల కానుందని చెప్పాడు.