ఉట్నూర్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

ఉట్నూర్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

ఆదిలాబాద్, వెలుగు: ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఆదిలాబాద్​ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. మంగళవారం సాయంత్రం ఉట్నూర్ పోలీసు స్టేషన్​లో కమాండ్ కంట్రోల్ రూమ్​ను ఏఎస్పీ కాజల్ సింగ్, ఐటీడీఏ పీవో ఖుష్భుగుప్తాతో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఉట్నూర్ లో 37, ఇంద్రవెల్లి మండల కేంద్రంలో 13 సీసీ కమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

అధునాతన టెక్నాలజీ ఉన్న సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని, రాత్రీపగలు తేడా లేకుండా స్పష్టమైన దృశ్యాలను చూపిస్తాయన్నారు. 30 రోజుల బ్యాకప్ ఉందన్నారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ మడావి ప్రసాద్, నార్నూర్ సీఐ పి.ప్రభాకర్, ఎస్సైలు కె.ప్రవీణ్, అఖిల్, మనోహర్ పాల్గొన్నారు.