హుజూర్ నగర్ లో దోపిడీ వ్యవస్థను నడిపిస్తున్న ఎమ్మెల్యేలు

హుజూర్ నగర్ లో దోపిడీ వ్యవస్థను నడిపిస్తున్న ఎమ్మెల్యేలు

కోదాడ, గరిడేపల్లి, వెలుగు:  కోదాడ, హుజూర్ నగర్ ఎమ్మెల్యేలు దోపిడీ వ్యవస్థను నడిపిస్తున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.  బీఆర్ఎస్ అసమ్మతి నాయకులు చందర్ రావు, శశిధర్ రెడ్డి, యెర్నేని బాబు, పాండురంగరావు మంగళవారం కాంగ్రెస్‌‌లో చేరగా.. కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్‌‌లో ఆయన మాట్లాడుతూ... రెండు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు సాండ్, లాండ్, వైన్, మైన్, మట్టితో పాటు గంజాయి దందాలు నడిపిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారికి కేసీఆర్‌‌‌‌ మళ్లీ బీఫామ్‌‌ ఇవ్వడమంటే దందాలను ప్రోత్సహించడమేనన్నారు.

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా పోలీసులు బీఆర్‌‌‌‌ఎస్‌‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఫామ్స్‌‌ తీసుకొని వచ్చిన ఎమ్మెల్ఏలు ర్యాలీ తీస్తే డీఎస్పీ, సీఐలు లు స్వాగతం చెప్పడం నిబంధనలకు విరుద్ధమని మండిపడ్డారు. దీనికి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.  బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేత శశిధర్ రెడ్డి మాట్లాడుతూ..  కోదాడ టికెట్ మార్చాలని తాము కోరినా హైకమాండ్ పట్టించుకోలేదని, దీంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు  తెలిపారు. అనంతరం గరిడేపల్లి మండలం వెలిదండ గ్రామంలో చెనగాని సాంబయ్య ఆధ్వర్యంలో పలు పార్టీలకు చెందిన నాయకులను  కాంగ్రెస్‌‌లో చేరారు.