ఏనాడు కూడా రైతుబంధు,దళితబంధు ఆపమని చెప్పలే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

 ఏనాడు కూడా రైతుబంధు,దళితబంధు ఆపమని చెప్పలే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

డిసెంబర్ మొదటి వారంలో  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని హుజూర్‌నగర్ కాంగ్రెస్ అభ్యర్థి , ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.  సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ముదిరాజ్  కీలక  నాయకులు బాషబోయిన భాస్కర్ .. ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ముదిరాజ్ బిడ్డ భాస్కర్ కాంగ్రెస్ లోకి రావడంతో బలం పెరిగిందన్నారు.  

మెడిగడ్డ ప్రాజెక్ట్ కూలిపోతుంది ... బీఆర్ఎస్ పార్టీ కూడా కూలిపోతుందని ఉత్తమ్ విమర్శించారు.  60 ఏళ్ల క్రితం కాంగ్రెస్ కట్టిన డ్యాములు చెక్కు చెదరలేదని చెప్పారు.  కమీషన్ల కక్కుర్తితో కడితే మూడేళ్లకే అన్నారం, సిందిళ్ళ,మెడిగ్గడ బ్యారేజీలు కూలిపోతున్నాయన్నారు.  కేసీఆర్ రి డిజైన్ చేయడంతోనే ప్రాజక్ట్ లకు ముప్పు వాటిల్లుతున్నాయని ఆరోపించారు.  భూకంపం వచ్చిన డ్యాములు కూలిపోకుండా నిర్మించాలని తెలిపారు.  

ఎక్కడ,ఏనాడు కూడా రైతు బంధు,దళిత బంధు ఆపమని తాము  చెప్పలేదన్నారు ఉత్తమ్.  కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు.