బీఆర్ఎస్​ప్రభుత్వం యువతను మోసం చేసింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్​ప్రభుత్వం యువతను మోసం చేసింది : ఉత్తమ్ కుమార్ రెడ్డి
  •   ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి

కోదాడ, వెలుగు : ఫీజు రీయింబర్స్​మెంట్ ఇవ్వకుండా, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా బీఆర్ఎస్​ప్రభుత్వం రాష్ట్రంలోని యువతను మోసిం చేసిందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కోదాడలో యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ ఆధ్వర్యంలో ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయా విభాగాల రాష్ట్ర అధ్యక్షులు శివసేనరెడ్డి, బల్మూరి వెంకట్ తోపాటు ఉత్తమ్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్​ప్రభుత్వం కనీసం పోటీ పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేదని మండిపడ్డారు. 

విద్యార్థుల ఆశలను పేపర్ లీకేజీలతో నీరుగార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. 70 సీట్లు గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. విద్యార్థులు, నిరుద్యోగులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి, పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణ రెడ్డి, నాయకులు వరప్రసాద్ రెడ్డి, కందుల కోటేశ్వరరావు, యేజాజ్, బాగ్దాద్ తదితరులు పాల్గొన్నారు.