ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ ఎ‍మ్మెల్యే అరవింద్ గిరి హఠాన్మరణం

ఉత్తర్‌ప్రదేశ్ బీజేపీ ఎ‍మ్మెల్యే అరవింద్ గిరి హఠాన్మరణం

లక్నో : ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎ‍మ్మెల్యే అరవింద్ గిరి హఠాన్మరణం చెందారు. ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. లఖింపూర్ ఖేరి జిల్లా గోలా గోకరన్‌నాథ్ నియోజకవర్గం నుంచి ఎ‍మ్మెల్యే అరవింద్ గిరి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. గుండెపోటుకు గురికాగానే చికిత్స కోసం లక్నో తీసుకెళ్లే క్రమంలో సీతాపుర్ సమీపంలో అరివింద్ గిరి మరణించారని తెలుస్తోంది.

బీజేపీ ఎమ్మెల్యే మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అరవింద్ గిరి మృతి దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు. అరవింద్​ కుటుంబసభ్యులకు భగవంతుడు మనోధైర్యం చేకూర్చాలని ప్రార్థించారు.