కరోనా కట్టడికి.. యూపీ కొత్త ప్లాన్‌

కరోనా కట్టడికి.. యూపీ కొత్త ప్లాన్‌
  • వీకెండ్స్‌లో ఆఫీసులు, మార్కెట్లు క్లోజ్
  • ప్రకటించిన ఆదిత్యనాథ్‌ సర్కార్‌‌

లక్నో: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు యూపీలోని యోగి సర్కార్‌‌ సరికొత్త ప్లాన్‌ తీసుకొచ్చింది. వీకెండ్స్‌లో మార్కెట్లు, ఆఫీసులను క్లోజ్‌ చేయనున్నారు. కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. బ్యాంకులు, ఇతర ఇండస్ట్రీస్‌ మాత్రం పనిచేస్తాయని అన్నారు. ఇక నుంచి గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌కి కూడా వారానికి ఐదు రోజులే ఆఫీస్‌ అని చీఫ్‌ సెక్రటరీ, హోం డిపార్ట్‌మెంట్‌ అవినాష్‌ కే అశ్వథీ చెప్పారు. ఫ్యాక్టరీలో ప్రొడక్షన్‌, మూమెంట్‌ ఆఫ్‌ గూడ్స్‌ మాత్రం కొనసాగుతాయని చెప్పారు. ఎవరైనా రూల్స్‌ ఫాలో అవకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు. “ వీకెండ్స్‌లో సోషల్‌ యాక్టివిటీస్‌పై పూర్తి నిషేధం ఉంటుంది. హెల్త్‌, ఇతర గవర్నమెంట్‌ డిపార్ట్‌మెంట్లు శానిటేషన్‌, స్క్రీనింగ్‌ డ్రైవ్‌ చేపడతారు” అని ఆయన అన్నారు. పోలీసులకు యాక్షన్‌ తీసుకునే పూర్తి రైట్స్‌ ఉన్నాయని అన్నారు. యూపీలో రోజు రోజుకి కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో శనివారం నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు పూర్తి లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే.