తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి: ఘాజియాబాద్ ఎమ్మెల్యే కార్గే

తెలంగాణలో కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి: ఘాజియాబాద్ ఎమ్మెల్యే కార్గే

మిర్యాలగూడ, వెలుగు : తెలంగాణలో కుటుంబం పాలన సాగుతోందని, మరో మూడు నెలలు తెలంగాణ ప్రజలు దానికి స్వస్తి పలుకుతారని ఉత్తరప్రదేశ్ లోని ఘాజియాబాద్​ ఎమ్మెల్యే అతుల్ కార్గే అన్నారు. ఆదివారం స్థానిక బృందావన్ గార్డెన్ లో పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేండ్లుగా రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతుందన్నారు. 

తెలంగాణ సంపద దేశ ప్రజలకు కాకుండా కేసీఆర్​ కుటుంబం అనుభవిస్తోందని విమర్శించారు. అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా నిధులు విడుదల చేస్తోందని గుర్తు చేశారు. తెలంగాణలో రోడ్లు రైలు మార్గాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాసరావు, రేపాల పురుషోత్తం రెడ్డి, వెంకట్ రెడ్డి, కన్మంత అశోక్ రెడ్డి, సత్యప్రసాద్,బంటు గిరి, చిలుకూరు శ్యామ్, యాదమ్మ , హనుమంత రెడ్డి, సీతారాంరెడ్డి, రాఘవ రెడ్డి, సాంబయ్య, జానకిరాముల, విద్యాసాగర్, సరిత, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలి: బీజేపీ కర్ణాటక స్టేట్ సెక్రటరీ నవీన్ జీ

హాలియా : వచ్చే ఎన్నికల్లో నాగార్జున సాగర్​ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుపుకు కృషి చేయాలని బీజేపీ కర్ణాటక స్టేట్ సెక్రటరీ కేఎస్​ నవీన్ జీ అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లా హాలియా పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే నోముల భగత్​ ఇచ్చిన హామీల అమలులో విఫలమయ్యారని  ఆరోపించారు. కేంద్ర పభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్​ రెడ్డి, నియోజకవర్గ నాయకులు కంకణాల నివేదిత రెడ్డి, పానుగోతు రవి నాయక్, అసెంబ్లీ కన్వీనర్ చలమాల వెంకట్ రెడ్డి, మండల అధ్యక్షులు ఏరుకొండ నరసింహ, జనరల్ సెక్రెటరీ మామిడి వినోద్​, శంకర్​, ప్రవీణ్​, పునిత్​, శంకర్, సాయిరాం తదితరులు 
పాల్గొన్నారు. 

బలమైన అభ్యర్థికే బీజేపీ టికెట్​ 

యాదాద్రి : బలమైన అభ్యర్థికే పార్టీ టికెట్​ కేటాయిస్తుందని శిరహట్టి (కర్నాటక) ఎమ్మెల్యే చంద్రు లమానీ తెలిపారు. యాదాద్రి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ప్రవాసీ యోజనలో పాల్గొన్న ఆయన బీజేపీ కార్యకర్తలకు దిశా నిర్దేశంచేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతోందని పార్టీ కార్యకర్తలు ప్రజలకు మరింత చేరువ కావాలని సూచించారు. సర్వేలో తేలిన బలమైన అభ్యర్థికే పార్టీ టికెట్​ ఇస్తుందని చెప్పారు. మీటింగ్​లో పార్టీ లీడర్లు పడాల శ్రీనివాస్​, సూదగాని హరిశంకర్​ గౌ డ్​, వట్టిపల్లి శ్రీనివాస్​ గౌడ్​, సీహెచ్​ శ్రీనివాస్​,జాలపు వనజ 
పాల్గొన్నారు.