
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెహ్రీ గడ్వాల్ జిల్లా నైనబాగ్ బ్రిడ్జి వద్ద వేగం వస్తున్న ఓ కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కుటుంబ సభ్యులు సహ మరో ఇద్దరు మృతిచెందారు. ప్రమాదం గురించి తెలుసుకున్న పోలీసు అధికారులు, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప హాస్పిటల్ కి తరలించారు.