మందేసి గన్స్‌తో చిందేసిన ఎమ్మెల్యే

మందేసి గన్స్‌తో చిందేసిన ఎమ్మెల్యే

మందు తాగి గన్స్ పట్టుకుని చిందేసిన బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తరాఖండ్ ఖాన్ పూర్ ఎమ్మెల్యే కున్వర్ ప్రణవ్ సింగ్ డెహ్రాడూన్ లోని  ఓ హోటల్ లో  సహచరులతో కలిసి మందు తాగి డ్యాన్స్ చేస్తూ రెండు చేతుల్లో నాలుగైదు గన్లు పట్టుకుని డ్యాన్స్  చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇటీవలే కాలికి గాయమై ఆపరేషన్ చేయించుకుని వచ్చిన ప్రణవ్ సహచరులతో ఓ వేడుకలో పాల్గొన్నాడు. అయితే ప్రణవ్ సింగ్  ఇటీవలే ఓ జర్నలిస్టును చంపేస్తానని బెదిరించిన విషయంలో బీజేపీ అతన్ని సస్పెండ్ చేసింది.