నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తాం

నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారిస్తాం

ఉత్తరాఖండ్ లో ఇటీవల హత్యకు గురైన 19 ఏళ్ల రిసెప్షనిస్ట్ అంకితా భండారి తల్లిదండ్రులు, బంధువులను ఆ రాష్ట్ర సీఎం పుష్కర్ సింగ్ ధామీ కలిశారు. అంకితా భండారి సొంత గ్రామమైన  పౌరీ జిల్లాలోని దోబ్ శ్రీకోట్ లోని ఆమె నివసానికి సీఎం వెళ్లి వారని పరామర్శించారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని భాదితురాలు తల్లిదండ్రులకు సీఎం హామీ ఇచ్చారు. నిందితులను ఫాస్ట్ ట్రాక్  కోర్టులో విచారిస్తామని కూడా తెలిపారు. ఇప్పటికే భాదితురాలు కుటుంబానికి సీఎం రూ.25 లక్షల ప‌రిహారం ప్రకటించారు.

రిషికేశ్‌లోని  వ‌నాంత‌ర రిసార్టులో రిసెప్షనిస్ట్ గా పనిచేస్తున్న అంకితా భండారి సెప్టెంబ‌ర్ 18న హత్యకు గురైంది. రిసార్టు ఓన‌ర్ పుల్కిత్ ఆర్య, మేనేజ‌ర్ సౌర‌భ్ భాస్కర్‌, అసిస్టెంట్ మేనేజ‌ర్ అంకిత్ గుప్తాతో క‌లిసి ఆమెను హత్య చేసినట్లుగా పోలీసుల ద‌ర్యాప్తులో తేలింది.  పుల్కిత్ ఆర్య మాజీ మంత్రి  వినోద్ ఆర్య కుమారుడు కావడంతో బీజేపీ వినోద్ ఆర్య, అతని తమ్ముడు అంకిత ఆర్యలను పార్టీ నుంచి బహిష్కరించింది.