నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసు

నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసు

ఉత్తర భారతంలో భారీ గా  కురుస్తన్న వర్షాలకు నదులు పొంగిపొర్లుతున్నాయి. అయితే తీవ్ర వరద నీటితో ఉప్పొంగుతున్నాయి. ఉదృతంగా ప్రవహిస్తున్న గంగానదిలో కొట్టుకుపోతున్నఓ వ్యక్తిని ఉత్తరాఖండ్ పోలీసు ప్రాణాలకు తెగించి రక్షించాడు.

హర్యానాకు చెందిన విశాల్.. గంగానదిలో పవిత్ర స్నానం చేసేందుకు నదిలోకి దిగాడు. దీంతో అనుకోకుండా నదిలో వరద ఉదృతి పెరగడంతో కొట్టుకుపోసాగాడు. అప్పటికే నదిలో దూకిన విశాల్‌ను గమనించిన పోలీస్… వెంటనే లైఫ్ జాకెట్ సాయంతో నదిలోకి దిగి  కాపాడాడు. దీంతో నదిలో కొట్టుకుపోతున్న  వ్యక్తిని కాపాడిన పోలీసుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.