ఏడాది పాటు గుట్కా, పాన్‌మసాలాపై నిషేధం

ఏడాది పాటు గుట్కా, పాన్‌మసాలాపై నిషేధం

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఏడాదిపాటు గుట్కా, పాన్‌ మసాలాలపై నిషేధం విధించింది. గుట్కా, పాన్‌ మసాలాలను తయారు చేయడం, నిలువ ఉంచడం, పంపిణీ చేయడం, అమ్మకాలపై ఏడాదిపాటు నిషేధం విధిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించి ఆహార భద్రతా కమిషనర్ నితీష్ కుమార్ ఝా  ఆదేశాలు జారీ చేశారు. ఈ నిషేధం వెంటనే అమల్లోకి వచ్చింది. టుబాకో నమలడం, నికోటిన్ ఆధారిత ఉత్పత్తుల వాడకంతో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతుండటాన్ని గుర్తించిన త్రివేంద్ర సింగ్ రావత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 2006 ఆహార భద్రతా ప్రమాణాల చట్టం ప్రకారం, ప్రజాప్రయోజనాల రీత్యా ఏడాది పాటు ఏ ఆహార ఉత్పత్తులపైనైనా నిషేధం విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది.