త్వరలో ఉత్తరాఖండ్​లో యూసీసీ అమలు!

త్వరలో ఉత్తరాఖండ్​లో యూసీసీ అమలు!
  • దీపావళి తర్వాత అసెంబ్లీలో బిల్లు

డెహ్రాడూన్ : యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ)ను అమలు చేసేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం సిద్ధమైంది. దీపావళి తర్వాత యూసీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనుంది. యూసీసీని అమలు చేస్తే, దేశంలోనే మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలవనుంది. రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ యూసీసీపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాశ్ దేశాయ్ ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఇప్పటికే రిపోర్టు తయారుచేసిన ఈ కమిటీ.. త్వరలో దానిని ప్రభుత్వానికి అందజేయనుందని తెలిసింది. ఆ తర్వాత డ్రాఫ్ట్ బిల్లును ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తెలపనుందని సమాచారం.కాగా, పెళ్లి, విడాకులు, దత్తత వంటి అంశాల్లో అన్ని మతాలకూ ఒకే విధమైన చట్టం ఉండాలన్నదే యూసీసీ ముఖ్య ఉద్దేశం.