ఉత్తరాఖండ్లో విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకు పోయిన యమునోత్రి యాత్రికులు

ఉత్తరాఖండ్లో  విరిగిపడిన కొండచరియలు.. చిక్కుకు పోయిన యమునోత్రి యాత్రికులు

ఉత్తరాఖండ్ లో గత మూడు రోజులుగా ఎడతెరపి  లేకుండా కురుస్తున్న వర్షాలతో యమునోత్రి, భద్రినాథ్ హైవేపై కొండ చరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో యమునోత్రి యాత్రను అధికారులు నిలిపివేశారు. దీంతో యాత్రికులు, స్థానికులతో సహా చాలామంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. యమునోత్రి తీర్థయాత్రకు బ్రేక్ పడింది. 

చమోలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం పర్వతాల నుంచి పెద్ద బండరాళ్లు హైవేపై పడిపోయాయి. దీంతో యాత్రికుల రాకపోకలకు అంతరాయం కలిగింది. వర్షాల కారణంగా బద్రినాథ్, యమునోత్రి హైవేపై కొట్టుకుపోయింది. దీంతో హైవేను బ్లాక్ చేశారు. ప్రయాణికులు హైవేకి ఇరువైపులా చిక్కుకుపోయారని పోలీసులు తెలిపారు. ఉత్తర కాశీ జిల్లాలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు అనేక ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.